షారుఖ్ కుమారుడితో జోడీ కట్టనున్న శ్రీదేవి రెండో కుమార్తె?

  • ఒకే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న ఆర్యన్, ఖుషీ కపూర్
  • సన్నాహకాల్లో కరణ్ జొహార్
  • ఇప్పటికే జాన్వీని బాలీవుడ్ కు పరిచయం చేసిన కరణ్
బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ కిడ్స్ తెరంగేట్రం చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ జంటగా ఓ సినిమా తెరకెక్కబోతోందనేది బీటౌన్ టాక్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఇప్పటికే వీరిద్దరికీ ఫుల్ క్రేజ్ ఉంది. వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి.

ఈ నేపథ్యంలో వీరిద్దరిని ఒకే సినిమాతో వెండితెరకు పరిచయం చేయాలని దర్శకనిర్మాత కరణ్ జొహార్ భావిస్తున్నాడట. కథను రెడీ చేసే బాధ్యతను ఇప్పటికే కొందరు రచయితలకు అప్పజెప్పాడట. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను నిర్మించింది కూడా కరణ్ జొహారే. దీంతో, తన రెండో కుమార్తె బాధ్యతను కూడా అతనికే బోనీ కపూర్ అప్పగించారని సమాచారం.
Go Back to Shorts
Shahrukh Khan
sridevi
khushi kapoor
aryan
Karan Johar
bollywood

More Telugu News